కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు

ప్రపంచీకరణ
 వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడాన్నే ప్రపంచీకరణ అనవచ్చు.
* ప్రపంచదేశాల మధ్య వస్తువులు, సేవలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, శ్రమ, మానవ మూలధనం లాంటివి ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా ప్రవహిస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమైక్యంగా సంఘటితం కావడమే ప్రపంచీకరణ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)
పేర్కొంది.* ప్రపంచీకరణలో నాలుగు ప్రధాన అంశాలను గమనించవచ్చు.    i) వివిధ దేశాల మధ్య వస్తుసేవల స్వేచ్ఛా ప్రవాహానికి ఉన్న అవరోధాలను తగ్గించడం.    ii) దేశాల మధ్య మూలధన స్వేచ్ఛా ప్రవాహానికి తగిన వాతావరణాన్ని సృష్టించడం.    iii) సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిహద్దులు దాటి, ప్రపంచమంతా విస్తరించేలా చేయడం.    iv) దేశాల మధ్య శ్రామికుల గమనశీలతకు తగిన వాతావరణాన్ని సృష్టించడం.* నేడు అంతర్జాలం విస్తరించిన నేపథ్యంలో ప్రపంచమే ఒక విశ్వ గ్రామంగా మారిపోయింది.* అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) లాంటి వాటిని ప్రపంచీకరణకు ప్రతినిధులుగా చెప్పవచ్చు.* అంతర్జాతీయీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే నిరపేక్ష, తులనాత్మక వ్యయాలు, లాభాలు ఏవిధంగా ఉద్భవిస్తాయో ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో లాంటి సంప్రదాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ వ్యాపార సూత్రాలు తెలియజేస్తాయి.
1980 వ దశకంలో ఆవిర్భవించిన విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ప్రాచుర్యంలోకి తెచ్చాయి.* అంతర్జాతీయీకరణ, సరళీకరణల ఫలితమే ప్రపంచీకరణ అని చెప్పవచ్చు.* ప్రపంచీకరణ వల్ల గ్లోబల్ మార్కెట్‌ల ఆవిర్భావం, బహుళ జాతి సంస్థల (ఎంఎన్‌సీలు) ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగడం లాంటి ప్రధాన అనుకూల అంశాలు ఏర్పడతాయి.* రవాణ, కమ్యూనికేషన్ రంగాల శీఘ్రతర వృద్ధి వల్ల సాంకేతిక పరిజ్ఞానం బహుముఖంగా విస్తరిస్తుంది.* ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఎన్ఏఎఫ్‌టీఏ లాంటి కూటముల ద్వారా ఏర్పడ్డ ప్రాంతీయ వర్తక మండళ్లు ప్రపంచీకరణకు తోడ్పడుతున్నాయి.* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వాటి మార్కెట్లలో బహుళజాతి సంస్థల పేరుతో అభివృద్ధి చెందిన దేశాల్లోని అధికోత్పత్తి, అధిక స్థాపిత శక్తి ప్రవేశించడం వల్ల ప్రపంచీకరణ పెరుగుతోంది.* అంతర్జాతీయ వ్యాపారంలో వస్తుసేవల ఎగుమతి, దిగుమతులపై ఆంక్షల తొలగింపు, విదేశీ మారక ద్రవ్యంపై నియంత్రణలను తొలగించడం లాంటివి ప్రపంచీకరణకు అవకాశాన్ని ఏర్పరుస్తున్నాయి.* వివిధ దేశాల విదేశీ వ్యాపార చెల్లింపు శేషంలో మార్పులు జరిగి, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరగడం ప్రపంచీకరణ ఫలితమే.* వ్యాపార స్వేచ్ఛ, ప్రభుత్వ ప్రోత్సాహం, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ది, పోటీతత్వం లాంటివి ప్రపంచీకరణకు మరింతగా తోడ్పడతాయి.

భారతదేశంలో ప్రపంచీకరణ
* 1980 వ దశకం ప్రారంభంలో భారతదేశ విదేశీ మూలధనానికి కల్పించిన అనేక రాయితీలు ప్రపంచీకరణకు నాంది పలికాయి.
* గతంలో బహుళజాతి సంస్థల ప్రవేశానికి అవరోధంగా ఉన్న పలు రంగాల్లో అనుమతులిచ్చారు.* విదేశీ మారక నిరోధక చట్టం (ఎఫ్ఈఆర్ఏ) నిబంధనలను సడలించి, దాని స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (FEMA) అమల్లోకి తెచ్చారు.* దిగుమతులను సరళీకరించారు.* అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ) లతో కుదిరిన ఒప్పంద నిబంధనల ప్రకారం 1991 లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచీకరణకు బాటలు వేశాయి.* ఆరో, ఏడో పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రభుత్వ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం లోటుతో, తీవ్ర సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీల నుంచి 7 బిలియన్ డాలర్ల రుణం కోసం సంప్రదించింది.* అపుడు ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ భారత ప్రభుత్వాన్ని ఎల్‌పీజీ విధానాన్ని అమలు పరచాల్సిందిగా నిర్దేశించాయి. ఫలితంగా ప్రపంచీకరణ ఊపందుకుంది.

  భారతదేశంలోని అపార మానవ వనరులు, ముఖ్యంగా 400 మిలియన్లకుపైగా ఉన్న యువతకు ప్రపంచీకరణ ఫలాలు అందుకునే అవకాశం ఏర్పడింది.* ప్రపంచీకరణతో ప్రజలు, సంస్థలు, పెట్టుబడిదారుల ఆదాయాలు పెరిగి, స్వదేశీ మార్కెట్లు విస్తరించడంతోపాటు, మన సంస్థలు కూడా వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టి, లాభాలను ఆర్జించే అవకాశం ఏర్పడింది. టాటా గ్రూపు సంస్థలు, ఎయిర్‌టెల్ లాంటివి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పెడుతున్న పెట్టుబడులను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.* ప్రవాస భారతీయుల సేవలు, నైపుణ్యం, పెట్టుబడులు, అనుభవాలను కూడా ఉపయోగించుకోవచ్చు.
   
ఉదా: లక్ష్మి నివాస్ మిట్టల్ లాంటి వారు భారత్‌లో ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి ఆసక్తి చూపడం.* ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ స్థిరీకరణ, సంస్థాగత సర్దుబాట్లలో భాగంగా కోశ లోటును తగ్గించి, ద్రవ్య సప్లయ్‌ని తగ్గించడం, ఉత్పత్తి, పెట్టుబడి, ధరలపై నియంత్రణను తగ్గించి, స్వేచ్ఛా మార్కెట్ విధానాలను అనుసరించడం, విదేశీ మార్కెట్ల నుంచి వివిధ రకాల వస్తువుల, సేవల ప్రవేశానికి ఉన్న అడ్డంకులను తొలగించడం ప్రపంచీకరణలో భాగంగా చేసినవే.
   
ఉదా: భారత్‌లో శామ్‌సంగ్, ఎల్‌జీ లాంటి కంపెనీల ప్రవేశం.* దలిప్ స్వామి చెప్పిన విధంగా 1990-91 లో భారత్‌లో ఉన్న పరిస్థితులు ప్రపంచీకరణకు పురిగొల్పాయి.* ప్రపంచీకరణలో భాగంగా రూపాయి మారకపు విలువను తగ్గించడం (అమెరికన్ డాలర్‌తో), కరెంట్, మూలధన ఖాతాల్లో రూపాయి మారకం లాంటివి ప్రపంచీకరణలో భాగమే.
నేడు అనేక రంగాలు 100% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వాగతిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రధానంగా కిందివాటిలోకి మాత్రం అనుమతించడం లేదు.      i) రిటైల్ వ్యాపారం (సింగిల్ బ్రాండ్ ప్రొడక్ట్ రిటైలింగ్ మినహా)      ii) అణుశక్తి      iii) లాటరీ వ్యాపారం      iv) జూదం, బెట్టింగులు      v) చిట్‌ఫండ్ సంస్థలు      vi) నిధి కంపెనీలు* ప్రపంచీకరణ ప్రభావం వల్ల 1991 నాటికి సంక్షోభంలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2015-16 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరిగాయి.* ప్రపంచీకరణ వల్ల బహుళజాతి సంస్థలు భారీగా అవతరించి, భారతీయ సంస్థలను చిన్నవిగా చేసి, అసమాన పోటీని పెంచాయి.* అంతర్జాతీయ వ్యాపారంలో భారతదేశ వాటాను పెంచడానికి విదేశీ వ్యాపార విధానం (ఎఫ్‌టీపీ) 2015-20 ను ప్రకటించారు.* ప్రపంచ జీడీపీలో భారతదేశ వాటా 2008-13 మధ్య 6.1% నుంచి 2014-15 కి 7 శాతానికి పెరిగింది.
2015-16 లో 7.6% జీడీపీ వృద్ధి రేటుతో భారత్ చైనాను కూడా అధిగమించింది.*ఆసియా, ఇతర దేశాలతో ద్వైపాక్షిక, వ్యాపార ఒప్పందాల ద్వారా భారత్ అనేక కూటములను ఏర్పాటు చేసుకుని అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంచుకుంటోంది.
    
ఉదా: SAFTA, SAPTA, BIMSTEC, BRICS లాంటివి
 

ISHA SEARCH ENGINE