హరిత విప్లవం


హరిత విప్లవం
*
భారత్‌లో మూడో పంచవర్ష ప్రణాళికా కాలం (1961 -66)లో వ్యవసాయ రంగంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి మూలంగా ఆహార కొరత ఏర్పడింది. పబ్లిక్ లా - 480 కింద అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకున్నాం.* వ్యవసాయ ఉత్పత్తి పెంపునకు ఫౌర్డ్ ఫౌండేషన్ చేసిన సిఫార్సుల మేరకు 1960లో దేశంలోని 7 జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం (Intensive Agricultural District Programme - IADP)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.* IAAP కింద ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేశారు.* IADP లోని లోపాలను సవరించి 1965లో 'సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం' (Intensive Agricultural Area Programme - IAAP) గా మార్పు చేసి 114 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.నూతన వ్యవసాయక వ్యూహం / హరిత విప్లవం* హరిత విప్లవం అనే పదాన్ని 1968లో మొదటిసారి విలియం ఎస్. గాండ్ ఉపయోగించాడు.


* రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ సహాయంతో మెక్సికన్ గోధుమ రకాన్ని అభివృద్ధి చేసిన నార్మన్ బోర్లాగ్ (అమెరికా)ను హరిత విప్లవ పితామహుడు అంటారు.* భారత్‌లో హరిత విప్లవ పితామహుడు - ఎం.ఎస్. స్వామినాథన్
హరిత విప్లవం - నిర్వచనం:
    
వ్యవసాయంలో మేలైన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, సాగునీరు, ధరలు, పరపతి లాంటి అంశాల ద్వారా ముఖ్యంగా  అధిక ఉత్పత్తిని సాధించడాన్నే హరిత విప్లవం అంటారు.
*
హరిత విప్లవం లేదా నూతన వ్యవసాయక వ్యూహం అనేది ఒక ప్యాకేజీ కార్యక్రమం. 1966 ఖరీఫ్ కాలంలో ఉత్పత్తి పెంపునకు అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం (High Yielding Varieties Programme - HYVP)ను ప్రవేశపెట్టారు. ఈ నూతన వ్యవసాయ వ్యూహంలో కింది అంశాలు ఇమిడి ఉన్నాయి.1. HYVP (అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం)* 1965లో సోనారా - 64, లెర్మరోజా - 64 లాంటి గోధుమ వంగడాలను భారత్ దిగుమతి చేసుకుంది.* వరి పంట విషయంలో IR - 8 అధిక ఫలితాలను ఇచ్చింది.2. అల్ప ఫలనా కాలం పంటలను ప్రవేశపెట్టడం* ప్రధానంగా IR - 3, జయ, పద్మ లాంటి వరి రకాలు 4 నెలల్లో కోతకు రావడం సాధ్యమైంది.3. ఆధునిక సాంకేతిక పద్ధతులునూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను కింది అంశాల్లో ప్రవేశపెట్టారు.      ఎ) పంటల మార్పిడి విధానం, బహుళ పంటల విధానం      బి) నీటి పారుదల వసతుల కల్పన      సి) యాంత్రికీకరna

డి) పరపతి సదుపాయాల కల్పన      ఇ) పంటల రక్షిత విధానం (విత్తనశుద్ధి, క్రిమిసంహారకాలు, రసాయనాలు)      ఎఫ్) మద్దతు ధరల విధానం* 1964 నుంచి మద్దతు ధరల విధానం ప్రారంభం* 1965 ఆహారధాన్యాల ధరలపై సలహాకు వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు* 1965లో ఆహారధాన్య కొనుగోలుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఏర్పాటు.4. ప్రభుత్వ సంస్థలు - ఉత్పాదకాల ప్యాకేజీ
* 1963లో జాతీయ విత్తన సంస్థ ఏర్పాటు* 1963లో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC - 1963)* 1965లో రాష్ట్రాల్లో వ్యవసాయాధార పరిశ్రమల ఏర్పాటు* 1963లో వ్యవసాయ రీఫైనాన్స్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. 1982లో ఇది నాబార్డుగా మారింది.పై అంశాల కలయిక ద్వారా వ్యవసాయరంగ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ ఫలితాన్నే హరిత విప్లవం అంటారు.హరిత విప్లవం - సత్ఫలితాలు1. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల* హరిత విప్లవం వరి, గోధుమల ఉత్పత్తిపై ఎక్కువ ప్రభావం చూపింది.* మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో పప్పుధాన్యాల ఉత్పత్తి క్రమంగా తగ్గింది. అంటే పెద్దగా ఏ ప్రభావం చూపలేదు.


1950 - 51 (mt)
2012 - 13 (mt)
2013 - 14 (mt)
(2
అడ్వాన్స్)
1. ఆహారధాన్యాలు
51
257.13
263
      ) వరి
21
105
106
      బి) గోధుమ
6
93
95
2) నూనెగింజలు
5
30
32
3) పత్తి
3
34
35
4) చెరకు
57
341
345
*
మొత్తం ఆహారధాన్యాల్లో తృణ/ కాయ ధాన్యాలు, పప్పుధాన్యాలు ఉంటాయి. వీటిలో కాయధాన్యాల వాటా పెరుగుతూ ఉంటే, పప్పుధాన్యాల వాటా క్రమంగా తగ్గింది.
సంవత్సరం
తృణధాన్యాలు
పప్పు ధాన్యాలు
మొత్తం ఆహార ధాన్యాలు
1950 - 51
84
16
100
1990 - 91
92
8
100
2004 - 05
94
6
100
2011 - 12
93.4
6.7
100
 
 

2. వాణిజ్య పంటల ఉత్పత్తి పెరుగుదల* నూతన వ్యవసాయక వ్యూహ ప్రధాన లక్ష్యం ఆహారధాన్యాల పెరుగుదలను సాధించడం.* 1960 - 61 నుంచి 1973 - 74 వరకు వాణిజ్య పంటలపై హరిత విప్లవం ప్రభావం లేదు. దీన్ని డాక్టర్ ధరమ్ నారాయణ్ వాణిజ్య పంటల పక్షపాతంగా వర్ణించాడు.* 1973 - 74 తర్వాత వాణిజ్య పంటల్లో పెరుగుదల ఉంది.
పంట (mt)
1960 - 61
2012 -13
పెరుగుదల
చెరకు
110
341
3 రెట్లు
పత్తి
6
34
సుమారు 6 రెట్లు
జనుము
4
10
సుమారు 3 రెట్లు
నూనెగింజలు
3
30
సుమారు 10 రెట్లు
3. ఉత్పాదకత పెరుగుదల* 1960లో వరి ఉత్పాదకత 10 క్వింటాళ్లు. అది 2011 -12 నాటికి 23 క్వింటాళ్లకు పెరిగింది.
* ఇదే కాలానికి గోధుమ 8 క్వింటాళ్ల నుంచి 31 క్వింటాళ్లకు పెరిగింది.
4. పంటల తీరులో మార్పు* కాయధాన్యాల నిష్పత్తి పెరిగి, పప్పుధాన్యాల నిష్పత్తి తగ్గింది.

5. ఆదాయస్థాయి పెరుగుదల
6.
వ్యవసాయం ముందు వెనుక అనుబంధాలు అభివృద్ధి.
7.
ఉపాధి పెరుగుదల
8.
పేదరికం తగ్గుదలప్రతికూల ప్రభావం - హరిత విప్లవం       1. పెట్టుబడిదారి వ్యవసాయం       2. ఆదాయ వ్యత్యాసాల పెరుగుదల       3. ప్రాంతీయ వ్యత్యాసాలు       4. కొన్ని పంటలకే పరిమితం (గోధుమ, ఆలుగడ్డ మాత్రమే)       5. శ్రామికుల తొలగింపు       6. గ్రామీణ పర్యావరణ సమస్యల వృద్ధిసంస్కరణల కాలంలో వృద్ధి రేట్లు* నూతన వ్యవసాయక వ్యూహం ద్వారా భారత వ్యవసాయవృద్ధి, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత తగ్గింది.ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు: నీటిపారుదల సౌకర్యాల కొరత, ఆధునిక సాంకేతిక విజ్ఞానం అల్ప వినియోగం, ఉత్పాదకాల వాడకంలో అల్ప వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడం, పరపతి సౌకర్యాల కొరత మొదలైన కారణాల వల్ల వృద్ధి తగ్గింది.

వ్యవసాయ అభివృద్ధికి తీసుకున్న చర్యలు* 8వ ప్రణాళిక కాలంలో వ్యవసాయంతోపాటు, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.* భారత్‌లో మొదటి వ్యవసాయ విధానం ప్రకటన - 1993* నూతన వ్యవసాయ విధానం 2000లో ప్రకటించారు. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. దీన్ని 2000, జులై 28న ప్రకటించారు. ఇది 4% వ్యవసాయ వృద్ధి లక్ష్యంగా ఉంది.* శ్వేత విప్లవం (పాల ఉత్పత్తి/ Operation Flood) - 1970* నర్గీస్ కురియన్ నేతృత్వంలో శ్వేత విప్లవం ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తిదారు భారత్.* భారత్‌లో తలసరి పాల లభ్యత - 290 గ్రా. (2011 - 12)
రెయిన్‌బో విప్లవం
   
దీనిలో వివిధ వ్యవసాయ అనుబంధాల రంగాల వృద్ధికి చర్యలు చేపట్టారు. ప్రధానంగా చేపలు (Blue), మాంసం (Red), ఎరువులు (Grey), గుడ్లు (Silver), పండ్లు/ఆపిల్ (Golden), రొయ్యలు (shrimp), క్రూడ్ఆయిల్ (Black), ఆలుగడ్డలు (Round), సుగంధ ద్రవ్యాలు (Brown) మొదలైన వాటిని విప్లవాత్మకంగా ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు.* ఇంటెన్సివ్ కాటిల్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రామ్‌ - 1964 - 65 లో ప్రారంభమైంది.* నేషనల్ ఆయిల్‌సీడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు - 1985 - 86
* ఎం.ఎస్‌. స్వామినాథన్ అధ్యక్షతన 2004లో జాతీయ రైతు కమిషన్‌ను నియమించింది.* 2006 జూన్ 3 అప్పటి ప్రధాని మన్మోహన్ రెండో హరిత విప్లవానికి పిలుపు ఇచ్చారు.
 

ISHA SEARCH ENGINE