రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)/ కేంద్ర బ్యాంకు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)/ కేంద్ర బ్యాంకు
* ఆధునిక కాలంలో సార్వభౌమ దేశాల్లో కేంద్ర బ్యాంకు ముఖ్య ద్రవ్య సంస్థ.* దేశ ఆర్థిక విధానాలు, ద్రవ్య విధానాల అమలులో ఇది కీలక పాత్ర వహిస్తోంది.* విల్ రోజర్స్ అనే ప్రముఖుడు అగ్ని, చక్రం లాంటి నవకల్పనల మాదిరిగా కేంద్ర బ్యాంకును మూడో నవకల్పనగా అభివర్ణించాడు.* ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంకు - రిక్స్ బ్యాంక్.1656లో స్వీడన్‌లో దీన్ని ఏర్పాటు చేశారు.     బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ - 1694 (విధులు నిర్వహించిన మొదటి కేంద్ర బ్యాంకు)     బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ - 1800     బ్యాంక్ ఆఫ్ జపాన్ - 1882     ఇటలీ సెంట్రల్ బ్యాంక్ - 1893     ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ - 1913     కెనడా సెంట్రల్ బ్యాంక్ - 1934     రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 1935
కేంద్ర బ్యాంకు నిర్వచనాలు1. 'కేంద్ర బ్యాంకు ప్రధాన విధి స్థిరత్వం చేయడం, అంటే ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించడం' - కిచ్ అండ్ ఎల్‌కిన్2. 'ద్రవ్య పరిమాణం పెరుగుదల/ తగ్గుదలను నియంత్రణ చేయడం కేంద్ర బ్యాంకు విధి' - కేంట్3. 'ద్రవ్య విధాన అమలు కేంద్ర బ్యాంకు ముఖ్య లావాదేవి' - ఆర్.ఎస్.సేయర్స్4. 'వాణిజ్య బ్యాంకులకు అంతిమ రుణాలిచ్చే సంస్థ' - హత్రిభారత్ - కేంద్ర బ్యాంకు* భారత్‌లో కేంద్ర బ్యాంకును రిజర్వ్ బ్యాంకు అంటారు.* 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇది కేంద్ర బ్యాంకు విధులను నిర్వర్తించేది.* 1926లో కరెన్సీ, విత్తంపై ఏర్పడిన రాయల్ కమిషన్/ హెల్టన్ యంగ్ కమిషన్ కేంద్ర బ్యాంకు ఏర్పాటుకు సలహా ఇచ్చాయి.* సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ (1931) సూచనల మేరకు కేంద్ర బ్యాంకు ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది.* 1934లో భారత్ రిజర్వ్ బ్యాంకు చట్టాన్ని చేశారు.* ఆర్‌బీఐని 1935 ఏప్రిల్ 1న రూ.5 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేశారు. దీన్ని 1949 జనవరి 1న జాతీయం చేశారు.* ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. (1937 కలకత్తా నుంచి ముంబయికి మార్చారు)
ఆర్‌బీఐకి గవర్నర్, నలుగురు ఉప గవర్నర్లు, 20 మంది డైరెక్టర్లతో కూడిన బోర్డు ఉంటుంది.

* ఆర్‌బీఐ ప్రాంతీయ కేంద్రాలు హైదరాబాద్, కోల్‌కత, బెంగళూరు, చెన్నయ్, నాగపూర్, పాట్నా నగరాల్లో ఉన్నాయి.
* ఆర్‌బీఐ ద్రవ్య విధానాన్ని అమలు చేస్తుంది. భారత బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం - 1949 ప్రకారం భారత్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్‌బీఐకి సంపూర్ణ అధికారాన్ని కల్పించారు.
* ఆర్‌బీఐని భారత ద్రవ్య మార్కెట్‌లో శిఖరాగ్ర సంస్థగా పేర్కొంటారు.
* ఆర్‌బీఐ మొదటి గవర్నర్ సర్.అస్‌బోర్న్‌స్మిత్ (1935 - 1937)
* ఆర్‌బీఐ భారతీయ మొదటి గవర్నర్ సి.డి.దేశ్‌ముఖ్ (1943 - 49)
* ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్ - రఘురాం రాజన్
* ఆర్‌బీఐ ప్రచురించే పక్షపత్రిక - న్యూస్ లెటర్ (1974).రిజర్వ్ బ్యాంక్ విధులు* కరెన్సీ ముద్రణ, జారీ* ప్రభుత్వ బ్యాంకు* బ్యాంకులకు బ్యాంకు* అంతిమ రుణ దాత* క్లియరింగ్ హౌజుల నిర్వహణ* పరపతి నియంత్ర
విదేశీ నిధుల సంరక్షణ
* పర్యవేక్షణ విధులు
* అభివృద్ధి విధులు
* మారక రేటు స్థిరత్వంకరెన్సీ ముద్రణ, జారీ* ఆర్‌బీఐ చట్టం - 1934 ప్రకారం కరెన్సీ, ముద్రణ, జారీలో ఏకస్వామ్య అధికారం ఉంది.
* రూ.2 కరెన్సీ నుంచి రూ.1000 వరకు ఆర్‌బీఐ ముద్రించి పంపిణీ చేస్తుంది. వాటిపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకం చేస్తారు.
* ఒక రూపాయి నోటు, అన్ని నాణేలను ఆర్థిక శాఖ ముద్రిస్తుంది. రూపాయి నోటుపై ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది.
* ఆర్‌బీఐ జారీ చేసే ద్రవ్యం చట్టబద్ద టెండర్ ద్రవ్యం (Legal Tender Money).
* కరెన్సీ జారీకి 1956 వరకు అమలైన అనుపాత నిల్వల జారీ పద్ధతిని రద్దు చేసి 1957 నుంచి కనిష్ఠ నిల్వల పద్ధతి (Minimum Reserve System) ని ప్రారంభించారు.
* కనిష్ఠ నిల్వల పద్ధతిలో భాగంగా 1957లో రూ.200 కోట్లకు తగ్గించారు. అంటే కరెన్సీ జారీ సమయంలో కనిష్ఠ నిల్వలో రూ.115 కోట్లు బంగారం, రూ.85 కోట్లు విదేశీ మారకం/ సెక్యూరిటీలు ఉండాలి.భారత్‌లో నాణేల ముద్రణ జరిగే స్థలాలు: ముంబయి, కోల్‌కత, హైదరాబాద్, నోయిడా.

కరెన్సీ ముద్రణ కేంద్రాలు1. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ - నాసిక్2. సెక్యూరిటీ ప్రెస్ - హైదరాబాద్3. బ్యాంక్ నోట్స్ ప్రెస్ - దేవాస్ (ఉత్తరప్రదేశ్)4. సెక్యూరిటీ పేపర్ - ఔషంగాబాద్5. నూతనంగా నిర్మాణంలో ఉన్నవి - మైసూరు (కర్ణాటక), సాల్బోని (పశ్చిమ బెంగాల్)* భారత్‌లో కరెన్సీ ముద్రణ దశాంశమాన పద్ధతిలో జరుగుతుంది. ఈ రూపాయి (10 × 10 = 100 పైసలు = 1 రూపాయి) భారత ప్రామాణిక ద్రవ్యం. 1962లో మొదటి రూపాయిని ముద్రించారు.* 1835 నుంచి భారత ప్రామాణిక ద్రవ్యంగా రూపాయి అమల్లోకి వచ్చింది.ప్రభుత్వ బ్యాంకు* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు (జమ్మూ, కాశ్మీర్ మినహా) ప్రభుత్వ బ్యాంకుగా, ఏజెంట్‌గా పనిచేస్తుంది. సలహాదారుగా ఉంటుంది.* కేంద్ర, రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తుంది.* కేంద్ర, రాష్ట్రాలకు ఇచ్చే స్వల్పకాల రుణాలు 90 రోజుల పరిమితితో మంజూరు చేస్తుంది. వీటిని 'వేస్ అండ్ మీన్స్' (Ways & Means) అడ్వాన్సులు అంటారు.
బ్యాంకుల బ్యాంకు, అంతిమ రుణదాత* దేశంలోని అన్ని బ్యాంకులను నియంత్రించే అధికారం ఆర్‌బీఐకి ఉంది.
* బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం - 1949కి 1962లో చేసిన సవరణ ప్రకారం నగదు నిల్వల నిష్పత్తి (CRR) 3 - 15% ఉండాలి. ఈ విధంగా బ్యాంకుల వ్యవహారాలను క్రమబద్ధం చేస్తుంది. ఈ విధంగా బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది. బ్యాంకుల బిల్లులను రీ డిస్కౌంట్ చేస్తుంది. బ్యాంకింగ్ సంక్షోభ స్థితిలో వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ రుణాలిచ్చి ఆదుకుంటుంది. కాబట్టి ఆర్‌బీఐని అంతిమ రుణదాత అంటారు.పరపతి నియంత్రణ:* ఆర్‌బీఐకి దేశంలో ద్రవ్యంపై నియంత్రణాధికారం ఉంటుంది.
* ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణ స్థితులను నివారించి ఆర్థిక స్థిరత్వం చేకూర్చడానికి పరపతి నియంత్రణ చేస్తుంది. ద్రవ్యం హెచ్చు తగ్గులను నివారిస్తుంది.
* 1956 నుంచి ఎంపిక చేసిన పరపతి నియంత్రణలను ఎక్కువగా వినియోగిస్తుంది.క్లియరింగ్ హౌజులను నిర్వహించడం* ఆర్‌బీఐ క్లియరింగ్ హౌజుల ద్వారా అన్ని వాణిజ్య బ్యాంకులు తమ రాబడులు/ చెల్లింపుల సమస్యలను పరిష్కరించుకుంటాయి.
* భారత్‌లో ముంబయి, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్, కాన్పూర్, నాగ్‌పూర్, దిల్లీ నగరాల్లో క్లియరింగ్ హౌజులు ఉన్నాయి.
* ఇవి లేని చోట ఆర్‌బీఐ తరఫున ఎస్‌బీఐ క్లియరింగ్ హౌజ్‌గా పనిచేస్తుంది.

విదేశీ నిల్వల రక్షణ:* దేశంలో కరెన్సీ స్థిరత్వ సాధనకు ఆర్‌బీఐ విదేశీ నిల్వల సంరక్షణ బాధ్యతను చేపడుతుంది.పర్యవేక్షణ విధులు* బ్యాంకుల స్థాపన, లైసెన్సుల మంజూరీ, శాఖల విస్తరణ, లైసెన్సుల రద్దు లాంటి అంశాలపై ఆర్‌బీఐకి ఆధికారం ఉంటుంది.* బ్యాంకుల పర్యవేక్షణ ఆర్‌బీఐ బాధ్యత.అభివృద్ధి విధులు* దేశంలో వివిధ రంగాల అభివృద్ధికి ఆర్‌బీఐ ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేస్తుంది.* 1935లో వ్యవసాయ పరపతికి వ్యవసాయ పరపతి విభాగాన్ని (1951 నుంచి ప్రాధాన్యం) ఏర్పాటు చేసింది.* వ్యవసాయరంగ వృద్ధి కోసం 1982లో నాబార్డును ఏర్పాటు చేశారు.* పారిశ్రామిక పరపతికి 1964లో ఐడీబీఐని ఏర్పాటు చేశారు.    డిపాజిట్ బీమా కార్పొరేషన్ - 1962    యూటీఐ - 1964    గృహరుణాల కోసం - నేషనల్ హౌసింగ్ బ్యాంకు - 1988    పారిశ్రామిక పునర్నిర్మాణానికి - ఐఆర్‌సీఐ - 1972    అంబుడ్స్‌మన్ వ్యవస్థ - 1995 జూన్ 14న ఏర్పాtu.
ఆర్‌బీఐ లక్ష్యాలు     1. ద్రవ్య స్థిరత్వం     2. పరపతి నియంత్రణ     3. పరపతి విధానం రూపకల్పన, అమలుఆర్‌బీఐ ద్రవ్యవిధానం* ఆర్థిక వ్యవస్థలోని కొన్ని ఆదర్శ లక్ష్యాల సాధనకు ద్రవ్యం (నాణేలు, నోట్లు, M1, M3) ద్వారా ఆర్‌బీఐ చేపట్టే విధానమే ద్రవ్య విధానం.* ద్రవ్య సప్లయ్ హెచ్చుతగ్గుల నియంత్రణ విధానాన్ని ద్రవ్య విధానం అంటారు.* ఆర్‌బీఐ 3 నెలలకు ఒకసారి లేదా అవసరమైన సందర్భంలో పరపతి విధానం/ ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తుంది.* ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ నియంత్రణకు ఆర్‌బీఐ చేసే విధానాన్ని పరపతి నియంత్రణ సాధనాలు/ ద్రవ్య నియంత్రణ సాధనాలు అంటారు.ద్రవ్య విధానం - లక్ష్యాలు     1. ధరల స్థాయి నియంత్రణ     2. వ్యాపార చక్రాల నియంత్రణ (ద్రవ్యవిధానం ముఖ్య ఉద్దేశం)     3. సంపూర్ణ ఉద్యోగితా సాధన     4. మారక రేట్ల స్థిరత్వం     5. చెల్లింపుల శేషం సమతుల్యత     6. ఆర్థికాభివృద్ధి సాధna.
ఆర్‌బీఐ ఆధీనంలో పరపతి నియంత్రణ 2 రకాలుగా ఉంటుంది. వీటినే ద్రవ్య విధాన సాధనాలు అని కూడా అంటారు.    1) పరిమాణాత్మక పరపతి నియంత్రణ    2) గుణాత్మక/ ఎంపిక చేసిన పరపతి నియంత్రణI. పరిమాణాత్మక పరపతి నియంత్రణ* దీన్నే సాంప్రదాయ పద్ధతి అంటారు.* ఇది ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్య పరిమాణాలను నేరుగా పెంచుతుంది/ తగ్గిస్తుంది.
  
ఈ విధానంలో కింది అంశాలు ఉంటాయి.() బ్యాంకు రేటు/ రీడిస్కౌంట్ రేటు (BR)* ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటునే బ్యాంకు రేటు (BR) అంటారు.* వాణిజ్య బ్యాంకులు డిస్కౌంట్ చేసిన బిల్లులను ఆర్‌బీఐ రీడిస్కౌంట్ చేసే రేటు.* బ్యాంక్ రేటును ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ కాలాల్లో మారుస్తుంది.* ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును పెంచుతుంది. తద్వారా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇది పరపతి/ రుణాల తగ్గుదలకు దారితీసి, ద్రవ్య సప్లయ్, ఆదాయాలు, కొనుగోలు శక్తి, డిమాండ్లు తగ్గి ధరలు తగ్గుతాయి.* ప్రతిద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును తగ్గిస్తుంది. తద్వారా (ద్రవ్యోల్బణం - ధరలు) పై అంశాలన్నీ మారతాయి. దీనివల్ల వడ్డీ రేట్లు తగ్గి రుణ లభ్యత, ఆదాయాలు, ద్రవ్య సప్లయ్, కొనుగోలు శక్తి, డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. (ప్రతి ద్రవ్యోల్బణం - ధరలు.

(బి) చట్టబద్ధ నిల్వల నిష్పత్తి (Statutory Liquidity Ratio - SLR)* వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని నగదు, బంగారం, సెక్యూరిటీల రూపంలో తమ వద్ద ఉంచుకునే మొత్తాన్ని SLR అంటారు.
* SLRను 1962లో ప్రారంభించారు.
* ద్రవ్యోల్బణ కాలంలో SLRను ఆర్‌బీఐ పెంచుతుంది.
* ప్రతిద్రవ్యోల్బణ కాలంలో SLRను తగ్గిస్తుంది.
(సి) నగదు నిల్వల నిష్పత్తి (Cash Reserve Ratio - CRR)* వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తిని CRR అంటారు.
* 1956లో CRR ను ప్రారంభించారు.
* ఆర్‌బీఐ ఈ CRRను మార్చడం ద్వారా పరపతి పరిమాణాన్ని మారుస్తుంది.
* CRR పరపతి పరిమాణం
* CRR పరపతి పరిమాణం CRR, పరపతి పరిమాణం మధ్య విలోమ సంబంధం ఉంటుంది.
* ద్రవ్యోల్బణ కాలంలో CRRను పెంచి పరపతిని తగ్గించడం ద్వారా ధరలు తగ్గుతాయి.
* ప్రతిద్రవ్యోల్బణ కాలంలో CRR ను తగ్గించి పరపతిని పెంచి తద్వారా ధరలు పెరిగేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంది.
* ఆర్‌బీఐ సవరణ చట్టం - 1962 ప్రకారం 3 - 15% వరకు CRR ను మార్చే అధికారం ఆర్‌బీఐ పొందింది.

డి) రెపో రేటు* వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద స్వల్ప కాలానికి (1 - 15 రోజులు) తీసుకునే రుణాలపై ఆర్‌బీఐ విధించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.
* Re Purchasing Option rate (Repo Rate)
* రెపో రేటును 1992 డిసెంబరు 10న ప్రవేశపెట్టారు.
* స్వల్పకాల రుణాలపై ఆర్‌బీఐ విధించే వడ్డీ రేటు - రెపో రేటు
* ద్రవ్యోల్బణ కాలంలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది. ప్రతిద్రవ్యోల్బణ కాలంలో రెపోను తగ్గిస్తుంది.
() రివర్స్ రెపో రేటు* వాణిజ్య బ్యాంకులు తమ నిల్వలను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేసినందుకు ఆర్‌బీఐ వాటికి చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో అంటారు.
* వాణిజ్య బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటు.
* దీన్ని 1996 నవంబరు నుంచి ప్రవేశపెట్టారు.
* ద్రవ్యోల్బణ కాలంలో ఆర్‌బీఐ రివర్స్ రెపోను పెంచుతుంది. దాంతో బ్యాంకుల నుంచి నగదు ఆర్‌బీఐకి చేరుతుంది. దీనివల్ల వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ తగ్గి ధరలు తగ్గుతాయి.
* ప్రతిద్రవ్యోల్బణ కాలంలో ఆర్‌బీఐ రివర్స్ రెపోను తగ్గిస్తుంది.

(ఎఫ్) బహిరంగ మార్కెట్ వ్యవహారాలు (Open Market Operations)* ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో అమ్మకాలు, కొనుగోలు చేసే ప్రక్రియలను బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అంటారు.
* ఇవి ఆర్‌బీఐకి, ప్రజలకు, సంస్థలకు, బ్యాంకులకు మధ్య జరుగుతాయి.
* ద్రవ్యోల్బణ కాలంలో ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది. ఇలా బ్యాంకులు, సంస్థల నుంచి వచ్చిన ద్రవ్యం ఆర్‌బీఐకి చేరుతుంది. ఇది పరపతి సృష్టిని తగ్గించి ధరలు తగ్గుదలకు కారణమవుతుంది.
* ప్రతిద్రవ్యోల్బణ కాలంలో ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది.
* బహిరంగ మార్కెట్ చర్యలు సమర్థవంతంగా పరపతిలో మార్పులను తీసుకువస్తాయి.II. గుణాత్మక/ ఎంపిక చేసిన పరపతి నియంత్రణ సాధనాలు* ఎంపిక చేసిన రంగాలకు ద్రవ్య ప్రవాహం జరిగేలా చేసే సాధనాలివి. అభివృద్ధి దృష్ట్యా అవసరమైన రంగాలకు పరపతిని అందించేలా, హానికర రంగాలకు పరపతిని తగ్గించేలా ఉపయోగించే సాధనాలను గుణాత్మక సాధనాలు అంటారు.() మార్జిన్ల నిర్ణయం* బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు హామీగా ఉంచుకున్న వస్తువు/ ఆస్తుల విలువకు; బ్యాంకు ఇచ్చే రుణానికి మధ్య ఉన్న తేడాను మార్జిన్ అంటారు.* ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్లను పెంచి, ప్రతిద్రవ్యోల్బణంలో తగ్గిస్తుంది.

(బి) పరపతి రేషనింగ్* కేంద్ర బ్యాంకు వివిధ రంగాలకు రుణాల పరిమాణం, వేర్వేరు వస్తూత్పత్తికి ఎంతమేర రుణాలు ఇవ్వాలో నిర్ణయించడం అంటే ఏయే రంగాలకు, ఏయే వస్తువులకు పరపతిని ఇవ్వాలో ఆదేశించే విధానం.
* 1965 నవంబరులో క్రెడిట్ ఆథరైజేషన్ స్కీమును ప్రారంభించి 1988లో రద్దు చేసింది.
* వేర్వేరు వర్గాలకు వేర్వేరు వడ్డీలు విధించే విచక్షణాత్మక వడ్డీ రేటు విధానాన్ని 1995 నవంబరు 1న ప్రారంభించింది.
(సి) వినియోగ పరపతి క్రమబద్ధీకరణ* వివిధ వస్తు కొనుగోలుకు వినియోగ పరపతిని డౌన్ పేమెంట్ (ముందుగా చెల్లించాల్సిన మొత్తం), వాయిదా సంఖ్యలో మార్పు ద్వారా పరపతిని క్రమబద్ధం చేస్తుంది.* ద్రవ్యోల్బణ కాలంలో డౌన్ పేమెంట్‌ను పెంచి, వాయిదాల సంఖ్యను తగ్గిస్తుంది. ప్రతిద్రవ్యోల్బణంలో దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది.
(డి) నైతిక ఉద్బోధ* అంచనా వ్యాపారాలు, బ్లాక్ మార్కెటర్స్‌కు, ఆర్థిక రంగానికి హాని కలిగించే రంగాలకు రుణాలు ఇవ్వవద్దని వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే సలహా.
() ప్రత్యక్ష చర్యలు* ఆర్‌బీఐ ఆదేశాలను గౌరవించని సందర్భంలో వాణిజ్య బ్యాంకులపై నేరుగా తీసుకునే చర్యలను ప్రత్యక్ష చర్యలు అంటారు.

ఉదా: బ్యాంకులకు రుణాల నిరాకరణ, పెనాల్టీలు విధించడం, బ్రాంచుల పెంపును నిరాకరించడం, బ్యాంకుల విలీనం, రీడిస్కౌంట్ రేటు నిరాకరణ, చివరగా బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడం మొదలైనవి.
* 1982లో భారత ద్రవ్య వ్యవస్థ సమీక్షకు సుఖమయ్ చక్రవర్తి కమిటీని నియమించారు.
* బ్యాంకుల పనితీరు పర్యవేక్షణకు - పద్మనాభం కమిటీ (1995 - 96)
* ప్రభుత్వ బలహీన బ్యాంకుల పునర్‌వ్యవస్థీకరణ - వర్మ కమిటీ
* బ్యాంకులు, విత్త సంస్థల సమన్వయం - ఖాన్ వర్కింగ్ గ్రూప్ (1998)
* డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు - కలకత్తా
* అధిక సామర్థ్యం ఉండే ఖాతాదారులపై విధించే వడ్డీ రేటు - ప్రైమరీ లెండింగ్ రేtu.

ద్రవ్యోల్బణం - ప్రతిద్రవ్యోల్బణ కాలంలో పరపతి నియంత్రణ

చర్యలు (ఆర్‌బీఐపరిమాణాత్మక
ద్రవ్యోల్బణం (P )
ప్రతిద్రవ్యోల్బణం (P )
2014 జూన్ 3 ద్రవ్య/ పరపతి సమీక్షలో రేట్లు
1. BR పెంచుతుంది తగ్గిస్తుంది 9%
2. CRR (1956) పెంచుతుంది తగ్గిస్తుంది 4%
3. SLR (1962) పెంచుతుంది తగ్గిస్తుంది 22.5%
4. రెపో (1992) పెంచుతుంది తగ్గిస్తుంది 8%
5. రివర్స్ రెపో (1996) పెంచుతుంది తగ్గిస్తుంది 7%
6. OMO అమ్ముతుంది కొనుగోలు

గుణాత్మక





7. మార్జిన్లు పెంచుతుంది తగ్గిస్తుంది

8. డౌన్ పేమెంట్ పెంచుతుంది తగ్గిస్తుంది

9. వాయిదాల సంఖ్య తగ్గిస్తుంది పెంచుతుంది
      



      

ISHA SEARCH ENGINE