మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ
|
2) మధ్య యుగం
3) ఆధునిక యుగం
ఆదిమానవుడి ప్రారంభం నుంచి హర్షుడు పరిపాలించిన కాలం వరకు ఉన్న యుగాన్ని ప్రాచీన యుగం అంటారు. అంటే క్రీ.పూ. 2 లక్షల సంవత్సరాల నుంచి క్రీ.శ. 647 వరకు ఉన్న కాలం ప్రాచీన యుగం. చరిత్రకారులు బానిస విధానాన్ని ఈ యుగ ప్రధాన లక్షణంగా పేర్కొన్నారు. క్రీ.శ. 8 నుంచి 18 శతాబ్దాల మధ్య ఉండే కాలాన్ని మధ్య యుగంగా పేర్కొంటారు. మధ్య యుగ ప్రధాన లక్షణం భూస్వామ్య వ్యవస్థ. క్రీ.శ. 18 నుంచి ప్రస్తుతం వరకు ఉన్న కాలాన్ని ఆధునిక యుగంగా పేర్కొన్నారు. ఆధునిక యుగ ప్రధాన లక్షణం పెట్టుబడిదారీ వ్యవస్థ.
యుగం
|
ప్రధాన లక్షణం
|
» ప్రాచీన యుగం
|
బానిస వ్యవస్థ
|
» మధ్య యుగం
|
భూస్వామ్య వ్యవస్థ/ఫ్యూడలిజం
|
» ఆధునిక యుగం
|
పెట్టుబడిదారీ వ్యవస్థ
|
హర్షుడి మరణం తర్వాత (క్రీ.శ. 647) ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు పరిపాలించారు. మహ్మదీయులు రాజపుత్రులను ఓడించి ఇస్లాం రాజ్య స్థాపన చేశారు. కాబట్టి క్రీ.శ. 647 నుంచి 1206 వరకు ఉండే కాలాన్ని తొలి మధ్య యుగంగా 1206 నుంచి 1757 వరకు ఉన్న కాలాన్ని మలి మధ్య యుగంగా
చరిత్రకారులు పేర్కొన్నారు. ఆధునిక చరిత్రకారులు మాత్రం అరబ్బుల సింధు
దండయాత్ర జరిగిన క్రీ.శ. 712 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని ఆధునిక యుగం క్రీ.శ. 8వ శతాబ్దంలో ప్రారంభమైందని వివరించారు. పై విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే క్రీ.శ. 8 నుంచి 18 శతాబ్దాల మధ్యకాలాన్ని మధ్య యుగంగా
భావించవచ్చు. మధ్యయుగంలో ఉత్తర భారత దేశాన్ని రాజపుత్రులు, ఢిల్లీ
సుల్తానులు, మొగలు చక్రవర్తులు పరిపాలించగా దక్షిణ భారతదేశంలో చోళులు,
రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర, బహమనీ రాజ్యాలు, గోల్కొండ
కుతుబ్‌షాహీ రాజ్యాలు, శివాజీ మరాఠా రాజ్యం పరిపాలన చేశాయి.
భూస్వామ్య వ్యవస్థ:
భూస్వామ్య వ్యవస్థ:
మధ్య
యుగ కాలంనాటి ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే నాటి ఉత్తర, దక్షిణ
భారతదేశ రాజ్యాల వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధిని అధ్యయనం చేయాలి.
మధ్యయుగ ఆర్థిక వ్యవస్థను భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ లేదా ఫ్యూడలిజంగా పేర్కొంటారు. భూమిపై వచ్చే మిగులు విలువను ప్రత్యక్ష పాత్రలేని మధ్యవర్తులు దోపిడీచేసే విధానాన్నే భూస్వామ్య ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ అనే పదాన్ని ఆర్.ఎస్. శర్మ అనే చరిత్రకారుడు తొలిసారిగా ప్రయోగించాడు. 'ఇండియన్ ఫ్యూడలిజం' అనే తన గ్రంథంలో శర్మ భూస్వామ్య వ్యవస్థ ఆవిర్భవించిన విధానాన్ని వివరించాడు
ప్రముఖ భారతీయ చరిత్రకారుడు హర్బన్స్ ముఖియా తన గ్రంథం 'వాజ్ దేర్ ఎ ఫ్యూడలిజం ఇన్ ఇండియన్ హిస్టరీ'లో మధ్యయుగ ఆర్థిక వ్యవస్థను 'స్వేచ్ఛాయుత రైతాంగ ఆర్థిక వ్యవస్థ'గా పేర్కొన్నాడు. మరొక చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ దాన్ని మధ్యయుగ ఆర్థిక వ్యవస్థగా వ్యవహరించడమే సరైందని పేర్కొన్నాడు.
భూస్వామ్య వ్యవస్థకు పునాది వాస్తవంగా గుప్తులు కాలంలోనే పడింది. గుప్తచక్రవర్తులు తమ ఉద్యోగులు, పండితులకు భూములను దానం చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ ప్రారంభమైంది. క్రీ.శ. 7వ శతాబ్దంలో రాజపుత్రయుగంలో ఈ భూస్వామ్య వ్యవస్థ బాగా విస్తరించింది. కారణం రాజపుత్ర రాజులు విరివిగా భూములను జమీలు, భోగాలుగా దానం చేయడమే.
రాజపుత్ర యుగం
హర్షుడి తర్వాత దాదాపు 36 రాజవంశాల రాజపుత్ర రాజులు ఉత్తర భారత దేశాన్ని పరిపాలించారు. పరమారులు, ప్రతిహారులు, పాలవంశీయులు, సేనవంశీయులు, చందేలులు, చౌహానులు, గహద్వాలులు లాంటి అనేక రాజవంశాలు ఉత్తర భారతదేశాన్ని పాలించాయి. రాజపుత్ర యుగంలో రాజులు మధ్యవర్తులైన సామంతులు, రాణాలకు నగదు రూపంలో కాకుండా భూముల రూపంలో జీతాలు ఇచ్చేవారు. ఈవిధంగా ఇచ్చిన భూములను జమీలు లేదా భోగాలు (జమీ/భోగ) అనేవారు. ఈ భూములను పొందిన వ్యక్తులకు వాటిపై సర్వాధికారాలు అప్పగించేవారు. దానాలు చేసిన భూములను కౌలుదార్లకు ఇచ్చేవారు. మొదట్లో శాశ్వత కౌలుదారులుగా ఉన్నవారు తర్వాత తాత్కలిక కౌలుదారులుగా మారిపోయేవారు. ఈవిధంగా భూములు బదిలీ చేసే క్రమంలోనే భూమిపై అధికారం అనేకమందికి సంభవించింది. స్త్రీలకు కూడా భూములపై హక్కు ఏర్పడింది. ప్రముఖ చరిత్రకారుడు ఎ. అప్పాదొరై తన గ్రంథం ''ఎకనమిక్ కండిషన్ ఇన్ సౌత్ ఇండియా"లో ''భూమి వ్యక్తి ఆస్తిగా రూపొందడం, భూదానాలు విరివిగా కొనసాగడం, భూదానాల ద్వారా వ్యవసాయం విస్తరించడం" లాంటి విధానాలు వివరించాడు. అనేకమంది చరిత్రకారులు భూస్వామ్య వ్యవస్థపై చేసిన పరిశోధనల ఫలితంగా భూదానాలను అష్టభోగ హక్కులతో చేశారని విశదమతుంది. ఈవిధంగా ఏర్పడిన భూస్వాములు సొంతంగా సైన్యాలను పోషించడమే కాకుండా తగాదాలను తామే పరిష్కరిస్తూ సమాంతర ప్రభుత్వాలను నడిపేవారు. ఫలితంగా రాజుల అధికారం క్షీణించింది. రైతులపై భూస్వాముల ఆగడాలు కూడా పెరిగిపోయాయి.

రాజపుత్ర యుగంలో భూస్వామ్య వ్యవస్థ ఫలితంగా
రైతులు 'పరిమిత పంటలు పండించడమే మేలు' అనే విధానాన్ని అవలంభించారు. ఫలితంగా
అధిక ఉత్పాదకత లేకపోవడం వాణిజ్య విధానంలో ప్రతికూల పరిస్థితులకు
దారితీసింది. రాజుల మధ్య నిరంతర యుద్ధాలు, అస్థిరతల వల్ల కూడా వర్తక,
వాణిజ్యాలు మందగించాయి. ఇదే సమయంలో మనదేశంతో విదేశీ వ్యాపారం చేసే రోమ్
సామ్రాజ్యం, పర్షియాలోని ససానిడ్ సామ్రాజ్యం పతనమై పోవడం కూడా ప్రభావాన్ని
చూపాయి. కాబట్టే రాజపుత్ర యుగంలో వాణిజ్యం తగ్గి, ద్రవ్య చెలామణి కూడా
తగ్గిపోయింది. పట్టణాల అభివృద్ధి కూడా జరగలేదు. అరబ్బు రచయితలు నాడు చైనా
కంటే కూడా భారతదేశంలో పట్టణాల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్నారు. రాజపుత్ర
రాజులు పన్నులు అధికంగా విధించడం, పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ
కార్యక్రమాలకు కాకుండా ఆస్థాన వైభవానికి, విలాసవంత జీవనానికి, దేవాలయాల
నిర్మాణాలకు వినియోగించడం కూడా ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా మారడానికి
కారణమయ్యాయి. క్రీ.శ. 712లో అరబ్బులు సింధుపై దాడి చేసి ఇస్లాం మతాన్ని
ప్రవేశపెట్టడం మతపరంగా, ఆర్థికపరంగా మార్పును తెచ్చింది. భారతదేశంలో ఇస్లాం
మతాన్ని ప్రవేశపెట్టి జిజియా పన్నును వసూలు చేసిన పాలకుడిగా మహ్మద్ బిన్ ఖాసిం పేరొందాడు. అరబ్బుల సింధు దండయాత్రను 'సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయం'గా లేన్ పూలే వ్యాఖ్యానించాడు.
కాని అరబ్బులతో భారతీయులకు పరిచయం కలగడం మన సంస్కృతీ, సంప్రదాయాలను,
వాణిజ్య విధానాలను ఎంతో ప్రభావితం చేసింది. ముఖ్యంగా భారతీయ గణిత, ఖగోళ
శాస్త్రాలు పశ్చిమ దేశాలకు వ్యాపించాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో అరబ్బులు
ఆధిపత్యం పొందారు. అరబ్బులు భారతీయ సాంస్కృతిక రాయబారులుగా పేరొందారు .
తురుష్క పాలకులైన గజనీ మహ్మద్, ఘోరీ మహ్మద్ దండయాత్రలు మనదేశ ఆర్థిక వ్యవస్థను మరింత నాశనం చేశాయి. గజనీతో వచ్చిన అల్‌బెరూనీ రచన కితాబ్ - ఉల్ హింద్ నాటి ఆర్థిక వ్యవస్థను,
మహ్మదీయ దాడుల వల్ల కలిగిన ఫలితాలను వివరిస్తుంది. రాజపుత్ర యుగంలో భూమి
శిస్తు 1/6వ వంతు ఉండేదని, బ్రాహ్మణులకు తప్ప మరెవ్వరికీ పన్ను మినహాయింపు
లేదని, గజనీ దాడుల వల్ల భారతదేశ సంపద నాశనమైందని అల్‌బెరూనీ తన రచనలో
వివరించాడు. అయితే ఇన్ని విషయాలు ప్రస్తావించిన బెరూనీ అప్పట్లో భూస్వామ్య
ప్రభువులు రైతులను పీడించే విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం విశేషం. ఈ
కాలంలో వంశ పారంపర్యంగా భూమిని అనుభవిస్తున్న భూస్వామ్య వర్గమే భూమిశిస్తు
నిర్ణయించి వసూలు చేసేది. వారే శిక్షలు విధించేవారు, జరిమానాలు వసూలు
చేసేవారు. భూస్వాముల అధికారాలు పెరగడం వల్ల రైతుస్థితి అణగారినట్లు ఆర్.ఎస్. నంది తన 'గ్రోత్ ఆఫ్ రూరల్ ఎకానమీ ఇన్ ఎర్లీ ఫ్యూడల్ ఇండియా' అనే గ్రంథంలో పేర్కొన్నాడు.
పన్నుల విధానం:
అప్పట్లో భూమిశిస్తు 1/6 నుంచి 1/3 వ వంతు వరకు ఉండేదని రోమిలా థాపర్ అభిప్రాయపడ్డారు. భూమిశిస్తుతోపాటు, పచ్చిక భూములపై పన్ను, నీటి వినియోగంపై పన్ను, వృత్తి పన్ను లాంటి అనేక ఇతర పన్నులు చెల్లించాల్సి వచ్చేది. ఘూర్జర ప్రతీహార పాలకుల శాసనాల్లో సుమారుగా ఆరు పన్నుల గురించి ఉంది. రాష్ట్రకూట శాసనాల్లో ఎనిమిది రకాల పన్నుల గురించి పేర్కొన్నారు. పాల రాజుల శాసనాలు రాజకుటుంబం కోసం కూడా పన్నులు వసూలు చేసినట్లు పేర్కొంటున్నాయి.
అప్పటి పన్నుల్లో కొన్ని రకాలు:
బాగా - పంట ఉత్పత్తిలో భాగం (1/6వ వంతు). దీన్నే భూమిశిస్తు అనేవారు. పర్నకర అంటే పుల్లరి (గడ్డిమైదాలపై పన్ను) పన్ను, గోకర అంటే పశువులపై విధించే పన్ను, ఖలభిక్షా అంటే భూమి దున్నుకున్నందుకు విధించే పన్ను. నిధి నిక్షేపాలపై విధించే పన్నును నిధినిధాన అనేవారు. అధికారులకు చెల్లించే పన్నును ప్రస్థక అని, సంతానం లేనివారిపై విధించేపన్నును అపుత్రకాధన అని పిలిచేవారు. కమ్మరి, కుమ్మరి, సాలె, కంసాలి, వడ్రంగి లాంటి వృత్తులవారు వృత్తిపన్నుల చెల్లించాలి. భూమిశిస్తు తర్వాత అధిక ఆదాయం వృత్తి పన్నుల ద్వారానే వచ్చేది. పశ్చిమోత్తర భారతదేశంలో కుట్టుపనివారు (దర్జీలు), నేతపనివారు, గూఢచారులు (గణకులు) ఎంతో ప్రసిద్ధి చెందారు.
వర్తక వాణిజ్యాలు
రాజపుత్ర యుగంలో వర్తక వాణిజ్యాల్లో క్షీణత కనిపిస్తుంది. నాణేల చెలామణి తక్కువగా ఉండటం, అధిక ఉత్పత్తి లేకపోవడం, స్థానికంగా అనేక కొలతలు, తూనిక విధానాలు అమల్లో ఉండటం; అస్థిరత లాంటి విధానాలతోపాటు రోమన్, ససానిడ్ సామ్రాజ్యాలు పతనమవడం లాంటి కారణాలతో వ్యాపారం క్షీణించింది. అయితే కోస్తా, బెంగాల్ ప్రాంతాలు పశ్చిమాసియా ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సంబంధాలు కొనసాగించడంతో ఆ ప్రాంతపు పట్టణాల వ్యాపారం కొంతమేర అభివృద్ధి చెందాయి. వృత్తిపనివారు వ్యవసాయ, సైనిక సంబంధ విధులను నిర్వర్తిస్తూనే 11వ శతాబ్దానికి కేవలం వ్యాపారం నిమిత్తమే వస్తువులను ఉత్పత్తి చేసేవారని ఆర్.ఎస్. నంది (చరిత్రకారుడు) వివరించాడు. వృత్తిపనివారు శ్రేణులుగా ఏర్పడి వర్తక వాణిజ్యాలు కొనసాగించేవారు. ఈ శ్రేణులు బ్యాంకులుగా వ్యవహరించేవి.
రుణాలు మంజూరు చేసేవి. ఇదేకాలంలో సముద్ర, భూమార్గాలపై అరబ్బుల ఆధిపత్యం ఏర్పడింది. భారతదేశ విదేశీ వాణిజ్యంపై క్రీ.శ. 7వ శతాబ్దం నుంచి అరబ్బుల ఆధిపత్యం కొనసాగింది. అరబ్బు సామ్రాజ్య విస్తరణ, ఉత్తర ఆఫ్రికా సామ్రాజ్యాల స్థాపనతో ఢిల్లీ సుల్తానత్ కాలానికి వ్యాపారం అభివృద్ధి చెందింది. వడ్డీ వ్యాపారం అధికంగానే కొనసాగింది. వడ్డీ 15% నుంచి 30% వరకు ఉండేది. ఈ వడ్డీ నిర్ణయం అధికంగా కులాన్ని బట్టి నిర్ణయించేవారు. బ్రాహ్మణులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. నాడు దేవాలయాలు ఆర్థిక కేంద్రాలుగా పనిచేసేవని ఆచార్య ఆర్. చంపక లక్ష్మి లాంటి చారిత్రకారులు పేర్కొన్నారు. దేవాలయాలు ఎందరికో జీవనోపాధిని కల్పించేవని కె.ఎ. నీలకంఠ శాస్త్రి పేర్కొన్నారు.
దేశీయ వ్యాపారంలో వర్తకుడు, సరుకులు తెచ్చే వాహకుడు ఒక్కరే. వర్తకులు తామే వస్తువులను సేకరించి మార్కెట్‌కు తెచ్చి అమ్మేవారు. కొన్ని వస్తువులను తూకం ద్వారా, మరికొన్నింటిని సంఖ్యా రూపంలో అమ్మేవారు. దేశీయ వ్యాపారం ఎక్కువగా నిత్యావసర వస్తువులతో జరిగేది. అలంకరణ వస్తువులు, ఇతర విలువైన వస్తువులు పట్టణాల్లో అమ్మేవారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో వాణిజ్య పంటలైన నీలిమందు, పత్తి, చెరకు లాంటి పంటలను విరివిగా ఉత్పత్తి చేసి అమ్మేవారు. బాగేల్‌ఖండ్ ప్రాంతంలో ఆహారధాన్యాలు, ఉప్పు, మిరియాలు, మద్యం లాంటి వస్తువులు అమ్మేవారు. రాజస్థాన్‌లో గుర్రాలు, నూనె, ఉప్పు వ్యాపారం బాగా జరిగేది. ముఖ్యంగా శాంబల్ కాలువపై గుర్రాలు, ఉప్పు వ్యాపారం అధికంగా విక్రయించేవారు. రాజస్థాన్‌లోని అర్థూన అనే పట్టణం కూడా వ్యాపార కేంద్రంగా వెలుగొందింది. పాలకులు దేశమంతటా రహదారులను నిర్మించి వర్తక వ్యాపారాల అభివృద్ధికి కృషి చేశారు. గ్రామీణప్రాంత ప్రజలు రహదార్ల నిర్మాణంలో శ్రమదానం (విష్ఠి) చేసేవారని నీలకంఠశాస్త్రి పేర్కొన్నారు. అప్పటి వర్తక శ్రేణులు అనేక పేర్లతో ప్రసిద్ధి చెందాయి. రాజపుత్ర యుగంనాటి దక్షిణ భారతదేశంలో నానాదేశీ, మణిగ్రామం, స్వదేశీ, పెక్కండ్రు, అయ్యావళి, అయినూరరు లాంటి అనేక వర్తక సంఘాలు ఏర్పాడ్డాయి. చిల్లర వర్తకం సంచార వ్యాపారం ద్వారా జరిగేదని ఎ. అప్పాదొరై పేర్కొన్నాడు. నూనె వ్యాపారులను తైలిక/ తేలిక; ఉప్పు వ్యాపారులను నేమిక/ వాణిక; ధాన్య వ్యాపారులను పెదాయో, పప్పుధాన్యాల వ్యాపారులను జణక విక్రయకార అని పిలిచేవారు. సంచార వర్తకులు బుధ, శుక్ర వారాల్లో సంతల్లో సరుకులు అమ్మేవారని తెలుస్తోంది.
నాటి విదేశీ వ్యాపారం ఎక్కువగా చైనా, పశ్చిమ ఆసియా, ఆగ్నేయాసియా దేశాలతో జరిగేది. తూర్పుతీరంలోని మహాబలిపురం, కావేరిపట్టణం, కోర్కై; మలబారు తీరంలోని క్విలాన్ లాంటి ఓడరేవుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. రాజపుత్రయుగం నాటి విదేశీ వాణిజ్యంలో పర్షియన్ గల్ఫ్‌లోని సిరాజ్ ఓడరేవు ఎంతో ప్రాధాన్యం వహించింది. భారత్‌తో వ్యాపారం వల్ల చైనాలోని టాంగ్ వంశం, శైలేంద్రుని శ్రీ విజయరాజ్యం, బాగ్దాద్‌లోని అబ్బాసిడ్ ఖలీఫాలు ఆర్థికంగా లబ్ది పొందాయి. సిరాజ్ రేవు నుంచి భారతదేశానికి కర్పూరం, విలువైన వజ్రాలు, దంతం, కాగితం, గంధపు చెక్క, అత్తరు, ఔషధాలు దిగుమతి అయ్యేవి. ఆగ్నేయాసియా నుంచి భారతదేశం వస్త్రాల అద్దకాలను దిగుమతి చేసుకునేది. భారతదేశ ఎగుమతుల్లో వస్త్రాలు ప్రధాన పాత్ర పోషించేవి. చైనా, పశ్చిమ దేశాలకు సుగంధ ద్రవ్యాలను, ఆగ్నేయాసియాకు మందులను, చైనాకు దంతం ఆభరణాలను భారతదేశం ఎగుమతి చేసేది. తూర్పు కోస్తా తీరంలో లభించే బుఖారిమ్స్ వస్త్రాలకు ఎంతో గిరాకీ ఉండేదని మార్కోపోలో రాశాడు. 13వ శతాబ్దం నాటికి దక్షిణ భారతదేశం నౌకావాణిజ్యంలో ముందంజ వేసింది.దక్షిణ భారత రాజ్యాలు
రాజపుత్ర యుగంలో దక్షిణ భారతదేశంలో చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు లాంటి పాలకులు రాజ్యపాలన చేశారు. వీరి కాలంలో దక్షిణ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. కానీ వ్యవసాయ రంగంలో భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ కొనసాగింది. తంజావూరు రాజధానిగా చేసుకుని పాలించిన చోళులు వ్యవసాయ, వాణిజ్యాలను ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చెరువులను తవ్వించి, వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించిన తొలి పాలకులు చోళులే. చెరువుల నిర్మాణంలో రేఖా గణిత పద్ధతులను కూడా అవలంభించారు.
చెరువులన్నీ ఒకే రేఖపైకి వచ్చేలా నిర్మాణాలు చేశారు. చోళుల కాలంలో భూమిపై హక్కు రెండు రకాలుగా ఉండేది. గ్రామస్థులు రాజు సొంత భూమిని ఉమ్మడిగా వ్యవసాయం చేస్తూ రాజుకు శిస్తు చెల్లించడం ఒక రకం, కాగా సొంత భూమి ఉన్న రైతులు తమ భూములపై వ్యవసాయం చేస్తూ పంటలో కొంత భాగాన్ని భూమిశిస్తుగా చెల్లించడం రెండో రకం. చోళులు ధనవంత రైతు కుటుంబాలైన వెల్లాలు అనే వర్గానికి భూస్వామ్య పదవులను ఇచ్చేవారు. నాటి భూస్వాములను, (మధ్యవర్తులు) మువ్వేంద వేలన్, అరయ్యార్ అనే పేర్లతో పిలిచేవారు. మువ్వేంద వేలన్ అంటే ముగ్గురు రాజుల వద్ద సేవలు అందించిన భూస్వామి అని అర్థం. అరయ్యార్ అంటే ముఖ్యుడు అని అర్థం. చోళుల కాలంలో భూదానాలను విరివిగా చేశారు. నాటి శాసనాల్లో అనేక రకాల భూదానాలను ప్రస్తావించారు. వాటిలో బ్రహ్మదేయ, వెల్లన్‌వాగై, పళ్లిచ్చందం, దేవమేయ, శాలభోగ లాంటి భూముల ప్రస్తావన ఉంది. బ్రాహ్మణులకు దానం చేసిన భూమిని బ్రహ్మదేయ అనేవారు. బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమిని వెల్లన్‌వాగై, పాఠశాలలకు ఇచ్చిన భూమిని శాలభోగ, దేవాలయాలకు ఇచ్చిన భూమిని దేవమేయ లేదా తిరునా ముత్తుక్కని, జైనమత సంస్థలకు ఇచ్చిన భూమిని పళ్లిచ్చందం అని పేర్కొనేవారు. చోళులు వర్తక వాణిజ్యల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించారు. చోళ రాజులు చైనా దేశానికి వర్తక రాయబారాన్ని కూడా పంపారు. 37 మంది వ్యాపారులు చైనా, భారత్ సముద్ర మార్గంలో ప్రయాణించారని ఇత్సింగ్ పేర్కొన్నాడు. చైనా నౌకలు సుమత్రా, మలయా రేవుల నుంచి వస్తువులను కొనుగోలు చేసేవి. భారతదేశానికి అరేబియా దేశం నుంచి గుర్రాలు దిగుమతి అయ్యేవి. చోళయుగంలో క్విలాన్ ఓడరేవు ద్వారా జరిగే వ్యాపారం గురించి యూదు యాత్రికుడైన బెంజమన్ తుదెల తన రచనల్లో వివరించాడు.
కేరళ పాలకుల సహాయంతో అరబ్బులు వ్యాపార ఆధిపత్యం పొందారని, చోళులు మలబార్‌ను తమ పాలనలోకి తేవడం ద్వారా అరబ్బుల ఆధిపత్యాన్ని కొంత మేర తగ్గించారని బెంజమన్ తుదెల పేర్కొన్నాడు. శ్రీ విజయరాజ్యం (ఆగ్నేయాసియా)ను జయించడం ద్వారా చోళులు మలక్కా జలసంధి తీర ప్రాంతంపై ఆధిపత్యాన్ని సంపాదించారు. అబూజైద్ అనే అరబ్బు యాత్రికుడు నాటి రాజులు, బ్రాహ్మణులు పాటించే ఆచారాలు, వారు ధరించే ఆభరణాల గురించి వివరించాడు. తంజావూరు నగర మార్కెట్లలో ధాన్యం, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, నగలు అమ్మే వారు. నగరానికి చెరువులు, బావుల ద్వారా నీటి సరఫరా జరిగేది. తంజావూరు దగ్గర్లో ఉన్న ఉరైయూర్ (వురయూర్) చేనేత వస్త్రాలకు ఎంతో పేరు గాంచింది. ఉరైయూర్ దగ్గరలో ఉన్న స్వామిమలై లోహ పరిశ్రమకు ప్రఖ్యాతి చెందింది. చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని శెక్కిలార్ రచించిన పెరియ పురాణం గ్రంథం వివరిస్తోంది. అదనూరు గ్రామంలో నివసించే పులయులు అనే అంటరాని కులంవారి జీవన విధానాన్ని పెరియ పురాణం గ్రంథం తెలుపుతుంది.
నాటి దక్షిణ భారత రాజ్యాల్లో రాష్ట్రకూట రాజ్యం మరొక ఐశ్వర్యవంతమైన రాజ్యం. రాష్ట్రకూట రాజ్యాన్ని ఎల్లోరా రాజధానిగా దంతిదుర్గుడు స్థాపించాడు. రాష్ట్రకూటుల్లో అమోఘవర్షుడు అనే రాజు కాలంలో సులేమాన్ అనే అరబ్బు వర్తకుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు. నాటి ఆర్థిక వ్యవస్థ తీరును సులేమాన్ వివరించాడు. రాష్ట్రకూట రాజులు కూడా విరివిగా భూములను దానం చేసి భూస్వామ్య వ్యవస్థ పెరుగుదలకు కారణమయ్యారు. రాష్ట్రకూట కాలంనాటి మధ్యవర్తులను నాడ్‌గవుండులు లేదా దేశాగ్రముక్తాలు అనేవారు. వీరే తర్వాత కాలలో దేశ్‌ముఖ్, దేశ్‌పాండేలుగా అవతరించారు. దంతిదుర్గుడు స్థిర గ్రామాన్ని కొల్హాపూర్ ప్రాంతంలోని ఒక బ్రాహ్మణుడికి దానం చేశాడు. రెండో గోవిందుడు నాసిక్ ప్రాంతంలో ఒక గ్రామాన్ని దానం చేశాడు.
మూడో ఇంద్రుడు తన రాజ్యాధికార స్వీకరణ సమయంలో మొత్తం 400 గ్రామాలను దానం చేయగా, నాలుగో గోవిందుడు మత, విద్యాసంస్థలకు 600 గ్రామాలను, దేవాలయాలకు 800 గ్రామాలను దానం చేశాడు. కాబట్టి రాష్ట్రకూట కాలంలో భూస్వామ్య ప్రభులు విపరీతంగా పెరిగారు. రాష్ట్రకూట పాలకులు అరబ్బులతో వర్తక వాణిజ్యాలు నిర్వహించడం ద్వారా తమ ప్రాంతాలను ఐశ్వర్యవంతమైన రాజ్యాలుగా రూపొందించుకున్నారు. ఈ విధంగా క్రీ.శ. 647 నుంచి 1206 వరకు ఉన్న తొలి మధ్యయుగంలో భారత ఆర్థిక వ్యవస్థ కొనసాగింది.